NTV Telugu Site icon

ICC World Cup: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పులు.. ఒక్కరోజు ముందుగానే భారత్, పాక్ మ్యాచ్

Ind Vs Pak

Ind Vs Pak

ఇండియా వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ నిర్వహణ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు తెలపడంతో మార్పులు చేశారు.ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్ జరిగే గుజరాత్‌లో అదే రోజు విజయదశమి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దీంతో మ్యాచ్ కు భద్రత కల్పించడం కష్టంగా మారుతుందని.. తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని కోరాయి. దీంతో బీసీసీఐ.. ఐసీసీకి ప్రతిపాదనలు పంపింది. దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అంగీకారం తెలపింది. దీంతో ఐసీసీ షెడ్యూల్ మార్పునకు ఓకే అనేసింది. ఒక్కరోజు ముందుగానే అక్టోబర్ 14న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.

Jailer Showcase: బాషా లెవల్ ఎలివేషన్స్.. ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ ఆన్ డ్యూటీ

మరోవైపు.. అంతకంటే ముందు పాకిస్తాన్ టీమ్ ఆడాల్సిన మ్యాచ్ తేదీలను కూడా మార్చారు. అందులో భాగంగానే అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరిగే పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ తేదీని కూడా మార్చారు. ఆ మ్యాచ్ ను అక్టోబర్ 10వ తేదీన జరుగనుంది. దానికి ఇరు జట్లు అంగీకరించాయి.

Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసు.. నలుగురు నిందితులు అరెస్ట్

అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ నవంబర్ 19 వరకు మొత్తం 46 రోజుల పాటు జరుగనుంది. తొలి మ్యా్చ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. టీమిండియా తన తొలి మ్యాచును అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం పది టీమ్‌లు పాల్గొననున్నాయి. ఒక జట్టు మిగతా 9 టీమ్‌లతో లీగ్ దశలో తలపడనుంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.