NTV Telugu Site icon

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం.. ప్రసంశల వెల్లువ

Chandrayan3

Chandrayan3

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఘన విజయం సాధించింది. అనుకున్న సమయం ప్రకారం.. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు చంద్రయాన్‌-3 రాకెట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు.

Read Also: Vasireddy Padma: మహిళా కమిషన్‌ అంటే పవన్‌కు గౌరవం లేదు.. నోటీసులు కూడా లైట్‌..!

అయితే, చంద్రయాన్-3 రాకెట్ విజయవంతం కావడంతో పలువురు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా..
ఈ ప్రయోగం విజయవంతంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది.. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం అని ప్రధాని అన్నారు. వాళ్ల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకి సెల్యూట్ అంటూ మోడీ తెలిపారు.

Read Also: Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో మొదటి ఎలివేటెడ్‌ ట్యాక్సీవే ప్రారంభం

చంద్రయాన్‌-3 విజయవంతంపై ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచ పటంలో గర్వించదగిన స్థానం సాధించారని కొనియాడారు. అంతరిక్ష యాత్రలో చంద్రయాన్-3 విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చంద్రయాన్ -3 ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు, టీంకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ అభినందనలు తెలిపారు.

Read Also: Dasoju Sravan : రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం భారతీయులందరికీ గర్వ కారణం అని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆమె అభినందనలు తెలిపారు. అంతరిక్ష చరిత్రలో భారత పతాకం మరోసారి రెపరెపలాడింది అని పేర్కొన్నారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం వెనుక కృషి చేసిన శాస్త్ర వేత్తలకు పురంధేశ్వరి అభినందనలు తెలిపారు. ఇస్రో కృషి విశ్వవ్యాప్తమైంది.. ఇస్రో విజయాలు
భారతీయులందరికీ గర్వకారణమని ఆమె తెలిపారు.