చంద్రయాన్-3పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు చంద్రుడిపై చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ దిగనునుంది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండింగ్ కానుంది. జాబిల్లి దక్షిణధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 5.45 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నిమిషాల పాటు ఈ ల్యాండింగ్ ప్రక్రియ కొనసాగనుంది. చంద్రయాన్-3 విజయవంతంమైతే భారత్ కొత్త రికార్డు సృష్టించనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలవనుంది. అయితే.. చంద్రయాన్-3 విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. చారిత్రక క్షణాల కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు. జులై 14న చంద్రయాన్-3ని ప్రయోగించింది ఇస్రో. ఎల్‌ఎంవీ 3-ఎం 4రాకెట్ ద్వారా చంద్రాయన్-3 ప్రయోగించింది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌ను చంద్రుడిపైకి రాకెట్ మోసుకెళ్లింది.
Also Read : IND vs IRE: నేడు ఐర్లాండ్‌తో చివరి టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను! ప్రయోగాలకు వేళాయే
అంతరిక్షంలోకి 3900 కిలోల పేలోడ్‌ను రాకెట్ మోసుకెళ్లింది. 3.84 లక్షల కిలోమీటర్ల ప్రయాణించి జాబిల్లిచేరింది చంద్రయాన్.. చంద్రయాన్-3 ప్రయోగం కోసం రూ.615 కోట్ల ఖర్చు చేసింది భారత ప్రభుత్వం. చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించనున్న చంద్రయాన్-3.. చంద్రుడి నిర్మాణం, పరిమాణంపై పరిశోధన చేయనుంది. చంద్రుడి వాతావరణంపై అధ్యయనం చేయనుంది చంద్రయాన్-3. అయితే.. ల్యాండింగ్ సమయంలో నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైంది. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఇస్రో తాజా ప్రయోగాన్ని నిర్వహించింది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్రమ్ ల్యాండర్.. ల్యాండింగ్ సమయంలో ఉపరితలం వైపు సెకనుకు 1.68 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.
Also Read : Viral Video: బాబోయ్ ఆపండ్రా నాయనా.. ఇలాంటివి చూస్తే జన్మలో తినరు..
