రాఘవ లారెన్స్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2.పీ వాసు దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తెలియజేసారు.ఇండస్ట్రీ లో ఆల్ రౌండర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు రాఘవా లారెన్స్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తోంది. పీ వాసు డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ తెలియజేశారు.. రేపు సాయంత్రం 5 గంటలకు బిగ్ అప్‌డేట్ రాబోతుంది అంటూ చంద్రముఖి రాజభవనం తలుపు తెరుస్తున్న లుక్ ను విడుదల చేశారు.ఇంతకీ చంద్రముఖి మూవీ మేకర్స్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇవ్వనున్నారనేది తెలియాలంటే రేపటి దాకా ఎదురు చూడాల్సిందే.. ఇప్పటికే కంగనా రనౌత్ చంద్రముఖి 2 క్లైమాక్స్ సాంగ్ కోసం కళా మాస్టర్ గారి పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్న ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.చంద్రముఖి సినిమా మొదటి భాగంలో రజనీకాంత్ హీరోగా నటించారు. ఆ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రజనీకాంత్ కు చంద్రముఖి సినిమాతో ఒక భారీ విజయం లభించింది.
ఆ సినిమాలో జ్యోతిక పెర్ఫార్మన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు.చంద్రముఖి సినిమాలో వచ్చే క్లైమాక్స్ సాంగ్ తమిళ్ లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. మరి సీక్వెల్ గా వస్తున్న చంద్రముఖి 2 ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.సీక్వల్ లో క్లైమాక్స్ సాంగ్ లో కంగనా యాక్టింగ్ చూడటం కోసం ఎంతో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. చంద్రముఖి 2లో లెజెండరీ కమెడియన్ వడివేలు కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రజనీకాంత్ చంద్రముఖి సినిమాను మరిపిస్తుందో లేదో చూడాలి.
https://twitter.com/LycaProductions/status/1674024888854798336?s=20