రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో దర్శకుడు పి. వాసు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి2.ఈ సినిమా 2004 లో సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వల్ గా రూపొందింది. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ హీరో గా నటించారు. రజనీకాంత్ ఆ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. దీనితో చంద్రముఖి సీక్వెల్ కు దర్శకుడు పి. వాసు సూపర్ స్టార్ ని సంప్రదించారు.కానీ రజనీకాంత్ సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ను రాఘవ లారెన్స్ దగ్గరకి చేరింది.హర్రర్ సినిమాలకు బ్రాండ్ గా మారిన రాఘవ లారెన్స్ ఈ సినిమాను ఒప్పుకున్నారు..హారర్ సినిమాలలో ఎంతగానో మెప్పించే రాఘవ లారెన్స్ ఈ సినిమాలో అద్భుతంగా నటిస్తాడన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది.ఇక ఈ సినిమా రాఘవ లారెన్స్,కంగనా రనౌత్ కాంబినేషన్ లో రూపొందుతుంది.ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తి అయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుంది. వినాయక చవితి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా విడుదల దగ్గరపడటంతో ఇటీవలే మూవీ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు టీమ్. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించింది.ఆ మధ్య మూవీ నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా రీసెంట్ గా కంగనా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది… తాజాగా ఈమూవీ ప్రమోషన్స్ పై మూవీ మరింతగా దృష్టి పెట్టింది.నేడు ( ఆగస్టు 25) చంద్రముఖి 2 ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నై లోని జెప్పియర్ ఇంజనీరింగ్ కాలేజీ లో సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు తెలియజేస్తూ..రాఘవా లారెన్స్ సరికొత్త లుక్ ను షేర్ చేసాడు ఇప్పుడీ లుక్స్ నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతున్నాయి.అలాగే నేడు ఈ ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో మీ ఆశీస్సులు కావాలని అభిమానులను, శ్రేయోభిలాషులు, మూవీ లవర్స్‌ను ఆయన కోరాడం జరిగింది..ఈ మూవీ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.