Pranayagodari : చంద్రబోస్ రిలీజ్ చేసిన ‘ప్రణయ గోదావరి’ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల గణేష్ మాస్టర్ చేతుల మీదుగా విడుదల చేసిన గు…గుగ్గు అనే పాటకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం నుంచి మరో బ్యూటీఫుల్ మెలోడి సాంగ్ చూడకయ్యో.. నెమలికళ్ళ అనే పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్ ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది.
మార్కండేయ ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు. చక్కటి జానపద సాహిత్యం ఇది. అందరికీ చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా మంచి సాహిత్యం అందించారు. పాట బాణీతో పాటు నడక, దాని వెనకాల వచ్చే బీట్ కూడా నాకు బాగా నచ్చింది. గాయనీ సునీత, సాయిచరణ్ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు ‘ప్రణయగోదారి’ టైటిల్ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అంతే వుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పాటతో పాటు చిత్రం కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను’ అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
Also Read
- Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
- ‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
- TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
- Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
- Tags
తాజావార్తలు
-
Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
-
Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా ‘లెజెండ్’ శరవణన్… ఈ సారి రచ్చ రచ్చే.!
-
‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
-
TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
-
Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!