Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ నేటితో ముగినుంది.. స్కిల్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్ట్ అయ్యారు చంద్రబాబు.. నేటికి ఆయన రిమాండ్ 26వ రోజుకు చేరింది.. అయితే.. చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై నేడు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వనుంది.. వర్చువల్ విధానంలో చంద్రబాబుని ఏసీబీ జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. మరోవైపు.. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ నేడు మెమో ఫైల్ చేసేందుకు సీఐడీ సిద్ధమైంది.. దీంతో, ఏసీబీ కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.
Read Also: Asian Games 2023: క్వార్టర్‌ఫైనల్‌లో పీవీ సింధు ఓటమి.. కనీస పోటీ ఇవ్వకుండానే..!
ఇక, స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్ల మీద కూడా నేడు ఏసీబీ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు.. ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.. దీంతో.. చంద్రబాబుకు కోర్టుల్లో ఊరట లభిస్తుందా? అనేది ఉత్కంగా మారింది. కాగా, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.. వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.