NTV Telugu Site icon

Vijaysai Reddy: జగన్ ను తొలగించాలని చంద్రబాబు కుట్ర

Vijaysaireddy

Vijaysaireddy

జగన్ ను తొలగించు కోవాలనే విషయంపై ఎప్పటి నుంచో చంద్రబాబు కుట్ర పన్నారని నెల్లూర లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “చంద్రబాబు ఒక విషయం చెప్పారు. జగన్ ను ఇక్కడి నుంచి లేపేస్తే ఏం చేసుకుంటాడని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబులో మానవత్వం లేదు.. మనిషి కాదు. ఒక క్రూరుడు ఒక మృగం లాంటివాడు. గతంలో తల్లి తండ్రిని విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా చంద్రబాబు అన్యాయం చేశారు. జగన్ కు ఏ ఆపద జరిగినా. ఈ భూ ప్రపంచంలో చంద్రబాబు ఉండడానికి అనర్హుడు. ప్రజలు ఉరితీస్తారని తెలియచేస్తున్నా. చంద్రబాబు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. గతంలో కాపుల ఆరాధ్య చేయమైన వంగవీటి రంగాను హత్య చేయించారు. ఐ.ఏ.ఎస్.అధికారి రాఘవేంద్ర రావు.. చెరుకూరి నారాయణ రెడ్డి లను హత్య చేయించిన వ్యక్తి చంద్రబాబు. కారంచేడు..గంగ పర్రుల లో దళితులను ఊచ కోత కోయించిన వ్యక్తి చంద్రబాబు.”

READ MORE: Prajwal Revanna sex scandal: జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణని బహిష్కరించే అవకాశం..

నేర ప్రవృత్తి కలిగిన చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారని విజయ సాయి రెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. “మళ్లీ మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తారా అని ప్రశ్నిస్తున్నా. జగన్ ఇచ్చిన హామీల్లో 99 శాతాన్ని అమలు చేశారు. గతంలో కంటే మరింత మెరుగైన పాలనను వచ్చే ఐదేళ్లలో జగన్ అందిస్తారు. రాష్ట్రంలో 87 శాతం మంది ఏదో ఒక పథకం కింద లబ్ది పొందారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మేలు చేశాం. చంద్రబాబు లాగా హంతకులు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళం కాదు. ఆయనకు వక్రబుద్ధి.. చంద్రబాబుకు ఒక హెచ్చరిక చేస్తున్న.. జగన్ కు ఏ ఆపద వచ్చినా చంద్రబాబుకు పుట్టగతులు ఉండవు. చట్ట ప్రకారం కోర్టులు ఉరితీస్తాయి. కులసలు. మతాలకు అతీతంగా అందరికీ సమన్యాయం చేస్తాం. చంద్రబాబు బీజేపీతో జతకట్టి వైసీపీపై ఆరోపణ లు చేస్తున్నారు. బీజేపీతో వైసీపీ ఏ రోజూ జత కట్టలేదు. వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తోంది. సి.ఏ.ఏ. యు.సి.సి…ట్రిపుల్ తలాక్ లపై మా విధానం ఒకటే. అన్ని మతాల అంగీకారంతోనే చట్టాలు చేయాలని కోరుతున్నాం. ఏకాభిప్రాయం లేకుండా బిల్లులు తీసుకుని వస్తే వ్యతిరేకిస్తాం.”