రాష్ట్రంలో అలజడులు సృష్టించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. చంద్రబాబు ముందస్తు వ్యూహం ప్రకారమే పుంగనూరులో అలజడులు జరిగాయని అన్నారు. పోలీసులపై రాళ్ళ దాడికి చంద్రబాబే ఉసి గొల్పి రక్తపాతం సృష్టించారని ఆయన ఆరోపించారు. ముందు ఇచ్చిన రూట్ ప్రకారం కాకుండా మరో రూట్ లో వెళ్తామని చంద్రబాబు అనడంతో పోలీసులు అడ్డుకున్నారని ఎంపీ మార్గానీ చెప్పారు.
Read Also: Health Tips: డిస్పోజబుల్ కప్పుల్లో తాగుతున్నారా? ప్రాణాలు పోయినట్లే..
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడి చేయించడం అమానుషం.. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు.. టీడీపీ శ్రేణుల దాడులు ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా కనిపిస్తుంది అని ఎంపీ భరత్ ఆరోపించారు. అనుమతి ఉంటే పోలీసులు ఎక్కడా ఆపరు.. యువతను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరించారు.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి.. తన పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు భావించారు.. చంద్రబాబువి పాతతరం రాజకీయాలు.. ఆయన చిప్ అప్డేట్ చేసుకోవాలని రాజమండ్రిం ఎంపీ అన్నారు.
Read Also: Chris Jordan: ఇదేం బ్యాటింగ్ రా సామీ.. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఊచకోత
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్దాలు ఆడి ప్రజల్లో నవ్వుల పాలయ్యారన్నారు. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019-23 వరకూ రూ.1.77 లక్షల కోట్లు అప్పు చేశారని స్పష్టంగా చెప్పినా.. ఈ విగ్గురాజు ఏకంగా రూ.10 లక్షల కోట్లు అంటూ విషం చిమ్మడానికి చూశాడని మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. జగనన్న బిక్షతో పార్టీ గుర్తుతో నెగ్గి, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం అతని హీన స్వభావం బయట పడింది అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.