CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. రేపు ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి తిరులమ బయల్దేరి వెళ్లిన యాన.. రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం మళ్లీ అమరావతి రానున్నారు.. ఇక, రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి. సాయంత్రం 4.41 గంటలకు తన చాంబర్ లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రిగా సచివాయంలోని మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు.. బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు చంద్రబాబు.
Read Also: Heavy Rains: మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. 14 మంది మృతి
ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టబోతున్నారు.. ఇక, సామాజిక పింఛన్ రూ. 4000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఫైల్ పై మూడో సంతకం చేస్తారు.. స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ ల ఏర్పాటుపై కూడా సంతకాలు చేస్తారని తెలుస్తోంది.. మరోవైపు.. 24 మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు.. కాసేపట్లో ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై ఓ ప్రకటన వెలవడే అవకాశం ఉందంటున్నారు.