Site icon NTV Telugu

Pension Distribution: పెన్షన్లపై పెద్ద కుట్ర.. మా అభ్యంతరం లేదు.. ఈసీ ఆదేశించలేదు..

Babu

Babu

Pension Distribution: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు పెన్షన్ల పంపిణీ వ్యవహారం కాకరేపుతోంది.. పెన్షన్ల విషయంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. సోషల్‌ మీడియా వేదికగానూ వీడియోలు షేర్‌ చేస్తూ.. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలు, సపోర్టర్లు.. ఇక, ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైసీపీపై విరుచుకుపడ్డారు.. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందే నీచమైన తీరు జగన్‌ది అని మండిపడ్డారు.. వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు అని విమర్శించారు.

Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..షాకిస్తున్న వెండి ధరలు..

అసలు పెన్షన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు చంద్రబాబు.. అంతేకాదు.. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించ లేదని గుర్తుచేశారు.. పెన్షన్ల విషయంలో నేడు జరుగుతుంది అంతా పెద్ద రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదన్నారు. ప్రజలారా కుట్రలను చేధించండి.. దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి అని పిలుపునిచ్చారు. అంతేకాదు.. తాము అధికారంలోకి రాగానే పెన్షన్ రూ.4000కు పెంచుతాం. ఇంటి వద్ద పెన్షన్ ఇస్తాం అని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Exit mobile version