NTV Telugu Site icon

Chandrababu: ఇదే నా జన్మదిన ఆశయం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu

Chandrababu

Chandrababu: ప్రజల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నానని.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నానన్నారు. తాను ఎప్పుడూ బ్యాలన్స్ తప్పలేదని.. పేదల కోసమే బతుకుతున్నానన్నారు. గూడూరులో సిలికా…స్వర్ణముఖి నదిలో ఇసుకను దోచుకున్నారని.. సిలికా పరిశ్రమలు వచ్చి పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకున్నానన్నారు. స్వర్ణముఖిలో చెక్ డ్యామ్‌లు కట్టి నీటిని నిల్వ చేయాలన్నారు. కానీ వందల లారీల మేర ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపదను సృష్టించడం టీడీపీకే తెలుసన్నారు. ప్రపంచంలోనే తెలుగు ప్రజలకు మరింత గుర్తింపు తీసుకు రావాలనేదే లక్ష్యమన్నారు. గూడూరు మహిళా సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.

Read Also: Yarlagadda VenkatRao: ఒక్కసారి అవకాశం ఇస్తే.. గన్నవరం రూపురేఖలు మారుస్తా..

జగన్ అందరినీ మోసం చేశారని.. ఎక్కడ చూసినా కుంభకోణాలేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనేది నా లక్ష్యమని.. ఇదే నా జన్మదిన ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చిందని.. మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం… ఆస్తి హక్కును ఎన్.టి.ఆర్ కల్పించారని ఆయన చెప్పారు. చట్ట సభల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నాటికి అమలు అవుతాయన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్ ఇచ్చారన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టానని.. మహిళలను పొదుపు ద్వారా ఆర్థికంగా బలోపేతం చేశానన్నారు. కుటుంబానికి ఆర్ధిక మంత్రిగా మహిళలను చేశానన్నారు. మహిళలకు కళాశాలల్లో సీట్లు…ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. ఐటీ రంగంలో కూడా మహిళలు రాణిస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.

గూడూరు మహిళా సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. “సమాజంలో ఆడ.. మగ మధ్య తేడా లేదు. వచ్చే ఎన్నికల్లో మహిళలు టీడీపీకి మద్దతు ఇస్తారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది. 18 సంవత్సరాలు పై బడిన మహిళలకు నెలకు రూ.1800 ఇస్తాం. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకూ నెలకు రూ.15 వేలు ఇస్తాం. దీపం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. పెన్షన్ ను రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు ఇస్తాను. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి…నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తాం. జాబ్ క్యాలండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇంటి వద్ద పింఛన్ ఇచ్చే సదుపాయం ఉన్నా ప్రభుత్వం ఇవ్వలేదు. ఏప్రిల్ నుంచి రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. వికలాంగులకు రూ.6 వేలు…పెన్షన్…వాలంటీర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తాం. ” అని చంద్రబాబు పేర్కొన్నారు.