సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలో 48 కోట్ల రూపాయలతో చేపట్టిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక నేడు 80 రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాక ముందు 682 మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండేవని.. నేడు 1012 స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Pawan Kalyan: ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి.. పవన్ సూటి ప్రశ్న
గత ప్రభుత్వాలు ఒక్క డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయలేదని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించాలని ఆయన తెలిపారు. సద్దితిన్న రేవు తలవాలన్నారు. చదువుకుంటున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలపాలని సూచించారు. 2014 కు ముందు రెసిడెన్షియల్ విద్యపై పెట్టిన ఖర్చు రూ.970 కోట్లు, నేడు రూ.4000 కోట్లు ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామని హరీష్ రావు తెలిపారు.
Rahul Flying Kiss Issue: వివాదంలో రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎప్పుడూ మన మీద ప్రేమ ఉండదని ఆరోపించారు. కానీ, మొన్న చంద్రబాబు తెలంగాణ భూములపై పాజిటివ్‌గా మాట్లాడారన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనులు ఎక్కువ.. ప్రచారం చేసేది తక్కువని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని.. చేసిన సేవలను గుర్తించి మరోసారి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు పంజాబ్ వరి ధాన్యంలో మొదటి స్థానంలో ఉంటే.. నేడు తెలంగాణ నెంబర్ వన్‌గా మారిందన్నారు. అంతేకాకుండా డాక్టర్ల ఉత్పత్తిలోనూ దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా మారిందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చి తెలంగాణలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.