Praja Galam Yatra: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో విడత ప్రజాగళం యాత్రలు చేపట్టిన విషయం విదితమే.. నేడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.. మధ్యాహ్నం 3 గంటలకు కొవ్వూరు చేరుకోనున్నారు చంద్రబాబు.. చాగల్లు రోడ్డు నుండి విజయ విహార్ సెంటర్ వరకు రోడ్ షోలో పాల్గొననున్న టీడీపీ అధినేత.. అనంతరం ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. ఇక, సభ అనంతరం గోపాలపురం పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు.. మరోవైపు చంద్రబాబు కొవ్వూరు పర్యటన, ప్రజాగళం సభ విజయవంతంపై బుధవారం టీడీపీ నేతలు సమీక్ష నిర్వహించారు.. హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో సంయుక్తంగా, వేర్వేరుగా సమావేశమై సభ జయప్రదానికి ప్రత్యేక కార్యాచరణ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ రోజు మధ్యాహ్నం లక్ష్మీవెంకటేశ్వర రైస్‌మిల్లు ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు చంద్రబాబు.. అక్కడి నుంచి కార్లు, బైక్ ర్యాలీ మధ్య ప్రదర్శనగా విజయవిహార్ సెంటర్‌కు వరకు చేరుకోనున్నారు చంద్రబాబు..
Read Also: GT vs PBKS: నేడు అహ్మదాబాద్ లో పరుగుల వరద పారేనా..?!
మరోవైపు నేడు నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కడపలో పర్యటించనున్నారు.. ఉదయం 11గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న భువనేశ్వరి.. కడప నియోజకవర్గంలోని 45వ డివిజన్‌లో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు నారా భువనేశ్వరి.. ఇక, ప్రొద్దుటూరు నియోజకవర్గం పెద్దశెట్టిపల్లి గ్రామంలో ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు నారా భువనేశ్వరి.