Site icon NTV Telugu

CM Chandrababu: స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా.. స్వర్ణాంధ్ర సాధ్యం కాదు..

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: మన ఇల్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం అన్నారు సీఎం చంద్రబాబు. అపరిశుభ్రతను తరిమేసే వాళ్లు నిజమైన వీరులని కొనియాడారు. విజయవాడలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనికులు టెర్రరిస్టులను ఏరి వేశారని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా వీరులే అన్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోందన్నారు. కానీ గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయిందరని చెప్పారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను గత ప్రభుత్వం వదిలేసిపోయిందని తెలిపారు. తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారన్నారు. చెత్త పన్ను వేశారు.. చెత్తను వదిలేశారు. మేం చెత్త పన్నును రద్దు చేశాం… చెత్తననూ తొలగించామన్నారు.

READ MORE: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి!

లెగసీ వేస్ట్ తొలగించిన మంత్రి నారాయణకు, మున్సిపల్ సిబ్బందికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. “జనవరి 1 నాటికి ఏపీని జీరో వేస్ట్ రాష్ట్రంగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలో 100 స్వచ్ఛ రధాలను అందుబాటులోకి తెస్తాం. పరిసరాలను శుభ్రంగా ఉంచేవాళ్లను గౌరవించుకోవాలి. ప్రతి కార్యాలయంలో, రోడ్ల మీద… ఇలా అన్ని చోట్లా పరిశుభ్రతే కన్పించాలి. స్వచ్ఛమైన, పచ్చనైనా, ఆరోగ్యకరమైన రాష్ట్రం కోసం పని చేద్దాం. మన రాష్ట్రంలోని వివిధ నగరాలు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా.. స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. సింగపూర్ దేశంలో స్వచ్చత పై అధ్యయనం చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అమలు చేశాం. రాత్రిపూట క్లీనింగ్ విధానం కూడా అమలు చేశాం. గ్రీన్ పాస్ పోర్టు ద్వారా విద్యార్థులలో చెట్లు పెంచే అలవాటును పెంచుతున్నాం. యూజ్ అండ్ త్రో పాలసీ కాదు… యూజ్-రికవర్-రీ యూజ్ పాలసీ అమలు చేస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Exit mobile version