Chandrababu – Pawan Kalyan Meet: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఆయనతో సమావేశం అయ్యారు. రెండో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు.. మరోవైపు.. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల పైనా చర్చించే అవకాశం ఉంది.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై సమీక్ష చేస్తున్నారు.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సహా వివిధ ప్రాంతాల్లో రేగుతోన్న అసంతృప్తిపై కూడా చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు.. అసంతృప్తులను చల్లార్చే అంశంపై మంతనాలు సాగిస్తు్న్నారు. మరోవైపు.. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు.. పొత్తులపై బీజేపీ హైకమాండ్‌తోచర్చించనున్నారు.. అదే సమయంలో చంద్రబాబు – పవన్ కల్యాణ్ భేటీ కావడం ఆసక్తిరేపుతోంది.. బీజేపీతో పొత్తుపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాయి టీడీపీ-జనసేన.
Read Also: Janhvi Kapoor-RC16: ఇట్స్ ఆఫీషియల్.. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్! పుష్ప 2లో కూడా
కాగా, ఇప్పటికే టీడీపీ – జనసేన పార్టీల అధినేతలు ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు.. అంతేకాదు.. జనసేనకు కేటాయించే సీట్లపై కూడా క్లారిటీ వచ్చేసింది.. కానీ, బీజేపీతో దోస్తీ విషయం మాత్రం తేలాల్సి ఉంది.. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో సమావేశమై.. పొత్తులపై చర్చించి వచ్చారు.. టీడీపీ-జనసేన సిద్ధంగా ఉన్నప్పటికీ.. బీజేపీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.. దీంతో.. బీజేపీపై మరింత ఒత్తిడి పెంచాలన్న లక్ష్యంగా.. టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటించాయి.. రెండో జాబితాపై కసరత్తు చేస్తున్నాయి.. మరి.. పురంధేశ్వరి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడంతో.. పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందనే చర్చ సాగుతోంది.