CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
- సోలార్ ఇంగోట్ వేపర్ కేంద్రానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- తొందర్లోనే ఏపీఎస్ ఆర్టీసీకి 1050 ఈవీ బస్సులు
- భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాంబిల్లి మండలంలో రెన్యు గ్లోబల్ సంస్థ సోలార్ ఇంగోట్ వేపర్ కేంద్రానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీ కోసం లక్షా 85 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పారు. తొందర్లోనే ఏపీఎస్ ఆర్టీసీకి 1050 ఈవీ బస్సులు వస్తాయని, భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామన్నారు. ప్రతీ ఇళ్లు ఓ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని, రైతులు కూడా పొలం దగ్గరే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. విద్యుత్ చార్జీలు పెంచమని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, భవిష్యత్తులోనూ చార్జీలు పెంచమని రాంబిల్లి నుంచి ప్రజలకు హామీ ఇస్తున్నాని సీఎం తెలిపారు.
‘2024 ముందు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, అభివృద్ది ఆగిపోయింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రీన్యూ ఎనర్జీ ముందుకు వచ్చింది. విద్యుత్ చార్జీలు పెంచమని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అనాలోచిత నిర్ణయాలు, అవినీతి కారణంగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. గత ప్రభుత్వం 32 వేల కోట్లు ప్రజలపై విద్యుత్ భారం మోపింది. 160 గిగా వాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆర్టీసీలో వెయ్యి ఈవీ బస్సులు రానున్నాయి. ఆర్టీసీ బస్సులు అన్నీ ఈవీ బస్సులుగా వస్తాయి. పేద వాళ్లకు ఈ సౌకర్యం అందుబాటలోకి తేవడం కోసం పనిచేస్తున్నాం. ప్రతీ ఇల్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలి. అవసరాలు తీరిన తర్వాత తిరిగి గ్రిడ్ కు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. భవిష్యత్తులోనూ కరెంట్ చార్జీలు పెంచం. రాంబిల్లి నుంచి ప్రజలకు ఇదే నా హామీ. విద్యుత్ ట్రాన్స్ మిషన్ లాస్ తగ్గించగలిగాం. టూ డౌన్ చార్జెస్ తగ్గించడం వల్ల భారం తగ్గింది’ అని సీఎం చెప్పారు.
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
’15 వేల 700 కోట్లు డిస్కంల నష్టాన్ని ప్రభుత్వం భరించింది. 22 నెలల్లో 800కు పైగా ఒప్పందాలు జరిగాయి. ప్రతీ ఒప్పందం కార్యాచరణకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా స్పీడ్ ఆఫ్ డెలివరీ విధానం అమలులో తెచ్చాం. 19-24 మధ్య రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. NDA బ్రాండ్ పారిశ్రామిక వేత్తలను ధైర్యం ఇచ్చింది. విధ్వంసం ఎవరిదో, వికాశం ఎవరి హయాంలో జరుగుతుందో ప్రజలు గురించాలి. జూలై మొదటి వారంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం ఉంటుంది. వర్షాలు ప్రారంభమైన వెంటనే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందుతాయి. నేషనల్ హైవే విస్తరణ పనులు మొదలు పెడుతున్నాం’ అని సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!