Site icon NTV Telugu

NDA Meeting Modi 3.0: ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. ఆమోదించిన నితీష్, చంద్రబాబు

Modi

Modi

NDA Alliance: లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరుగుతోంది. ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను నితిన్ గడ్కరీ, అమిత్ షా బలపరిచారు. ఇక, ఈ ప్రతిపాదనను జేడీయూ అధినేత నితిష్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆమోదించడంతో.. ఎన్డీయే లోక్ సభ పక్ష నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.

Read Also: Chandrababu: మోడీపై బాబు ప్రశంసలు.. ఆయన లాంటి పవర్‌ ఫుల్‌ వ్యక్తిని చూడలేదు..

కాగా, ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీయే పక్ష నేతలు కలవనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎంపీల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతికి మోడీ అందజేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ స్టార్ట్ అయింది. అంతకు ముందు ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించింది. జూన్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు భారత ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలు నితీశ్ కుమార్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, అజిత్ పవార్ తదితరులు హాజరయ్యారు. మిత్రపక్షాల ఎంపీలు కూడా హాజరయ్యారు.

Exit mobile version