రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మంగళవారం సాయంత్రం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ ప్రజా ప్రతినిధులతో భేటీ కోసం మంగళవారం విజయవాడ వచ్చిన ముర్ము తొలుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆపై వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆమె వైసీపీ ప్రజా ప్రతినిధులను కోరారు. అనంతరం విజయవాడలోని గేట్ వే హోటల్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ ప్రజా ప్రతినిధుల సమావేశానికి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ముర్ముకు పుష్ప గుచ్ఛాన్ని ఇచ్చిన చంద్రబాబు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఆమెకు పరిచయం చేశారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలకు ముర్మును పరిచయం చేసిన చంద్రబాబు… రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకే ఓటేయాలని పిలుపునిచ్చారు. హోటల్ గేట్ వే కు చేరుకున్న రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు చంద్రబాబునాయుడు. మన పక్కనున్న ఒరిస్సాకు చెందిన గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికచేయడం అభినందనీయం. మోడీ గారిని అభినందిస్తున్నారు. వివిధ హోదాల్లో ఆమె పదవికే వన్నె తెచ్చారు. అలాంటి వ్యక్తిని ఎంపికచేసి సామాజిక న్యాయం చేయాలని భావించారు. అందుకే టీడీపీ మద్దతు ఇచ్చింది. దేశ ప్రధమ పౌరులు ఎంపికలో భాగస్వామ్యం కావటం మన అదృష్టం.పేద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ అయిన ముర్ము ఎంతో కష్టపడి పైకొచ్చారు.సాధారణ పౌరులు అసాధారణ పదవికి ఎన్నిక కావటం మన రాజ్యాంగం విశిష్టత. సామాజిక న్యాయం కోసం ద్రౌపది ముర్మును బలపరచాలని నిర్ణయించాం అన్నారు చంద్రబాబు.
Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి జగన్ సపోర్ట్
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆదివాసి మహిళ, నా జిల్లా కు అతి దగ్గరగా వున్న మహిళ రాష్ట్రపతి అభ్యర్థి కావటం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ద్రౌపది ముర్ము వివాద రహితురాలు. ద్రౌపది ముర్ము కు మద్దతు ఇవ్వడం సంతోషంగా వుంది. టీడీపీ పుట్టడమే సామాజిక న్యాయం కోసం పుట్టింది. హరిజన, గిరిజనులకు ఎంతో న్యాయం టిడిపి చేసింది. ముర్ము నాయకత్వంలో దేశం మరింతా ముందుకు వెళ్లాలి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చాక మొదటిసారి గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం దక్కింది. టిడిపి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. 42 పార్టీలు దేశంలో ద్రౌపది ముర్ము కు మద్దతు ఇస్తున్నాయి. మన పక్క రాష్ట్రం మహిళ రాష్ట్రపతి అభ్యర్థి కావటం అదృష్ఠం. గతంలో అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కోవింద్ కు టిడిపి మద్దతు ఇవ్వడం సంతోషం. చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. ద్రౌపది ముర్ము ఏపీకి రావటం ఆనందదాయకం అన్నారు. సామాజిక స్పృహ ఉన్న కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ముర్ము ఎదిగారు.గేట్ వే హోటల్ లో కొద్దిసేపు విడిగా భేటీ ఆయ్యారు చంద్రబాబు, ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డి. ద్రౌపది ముర్ముకు అధికార పక్షం-ప్రతిపక్షం తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ మద్దతు పలికిన రాష్ట్రాలు ఏపీ, మిజోరాం మాత్రమేనని చంద్రబాబుతో అన్నారు జీవీఎల్. చంద్రబాబు ఆరోగ్య పరిరక్షణ ఉంగరం వివరాలు అడిగి తెలుసుకున్నారు సోము వీర్రాజు.వాజపేయ్ వచ్చేవరకూ ఎస్టీలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు.వాజపేయ్ హయాం నుంచే ఎస్టీలకు గుర్తింపు లభించటం ప్రారంభమైంది. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవటం సామాజిక బాధ్యతే తప్ప రాజకీయ అవసరం కాదు. చంద్రబాబు రాజకీయాల్లో దురంధరుడు. చంద్రబాబు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వడం సంతోషంగా ఉంది. వాజపేయ్ వచ్చేవరకూ ఎస్టీలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. వాజపేయ్ హయాం నుంచే ఎస్టీలకు గుర్తింపు లభించటం ప్రారంభమైంది. ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవటం సామాజిక బాధ్యతే తప్ప రాజకీయ అవసరం కాదన్నారు సోము వీర్రాజు. తనకు మద్దతు పలికిన టీడీపీ నేతలకు ద్రౌపది ముర్ము ధన్యవాదాలు తెలిపారు.
Shivsena: ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. ఎన్డీయే అభ్యర్థి ముర్ముకే మద్దతు