Site icon NTV Telugu

Chandrababu: సీఎస్‌కు చంద్రబాబు లేఖ.. వారిని ఆదుకోవాలి

Chandrababu

Chandrababu

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి లేఖ రాశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. మార్చిలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న ఆయన.. మరోవైపు.. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చేతికొచ్చే పంట నేలపాలైంది.. కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాల్లో భారీగా వరిపంట దెబ్బతిన్నదని.. కళ్లాల్లో ఆరబెట్టిన వేలాది టన్నుల ధాన్యం తడిచిపోయిందని తన లేఖలో పేర్కొన్నారు.. .

Read Also: MP Ranjith Reddy : తెలంగాణలో రైతుని రాజు చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్

మొక్కజొన్న రైతులు కూడా తీవ్రస్థాయిలో నష్టపోయారు.. ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీగా మిరప పంట దెబ్బతిన్నది.. కోతలు పూర్తి కాక.. ఈదురు గాలుల ధాటికి మిరప రాలిపోయింది.. అరటి, మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు అని సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.. పిడుగులు పడి ఏడుగురు రైతులు దుర్మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.. దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.20వేలు, మిర్చి, అరటి, మామిడికి రూ.50 వేలు పరిహారం అందించాలంటూ తన లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Exit mobile version