Site icon NTV Telugu

Chandrababu Naidu: ఇసుక అక్రమ రవాణాపై చంద్రబాబు ఫైర్.. సీఎస్ కి లేఖ

Ap Cs Babu

Ap Cs Babu

ఏపీలో ఇసుక మాఫియా ఎక్కువైందని టీడీపీ నేతలు విమర్శిస్తూనే వున్నారు. ఆధారాలతో బయటపెడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని మండిపడుతున్నారు. తాజాగా సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఇప్పటికే చాలు సార్లు ఫిర్యాదు చేశాం.అయినా ఆయా ఫిర్యాదులపై తగు రీతిలో స్పందించి చర్యలు తీసుకోలేదు.

ఇప్పుడు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.అధికార వైసీపీ నేతలతో ఓ వర్గం అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు.అనుమతించిన దానికి మించి జయప్రకాష్ వెంచర్స్ ఇసుక తవ్వకాలకు చేస్తోంది.ఇక్కడ అక్రమ తవ్వకాలపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది.ఎన్‌జిటి, ఇతర కోర్టుల నుండి అనేక ఆదేశాలు ఉన్నా.. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టలేదు.నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారు.

Read Also: IPL 2023: ఆర్సీబీతో పోటీకి సై అంటున్న కోల్ కతా

అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలు, అధికారులు విఫలం అవుతున్నారు.ఇష్టారీతిన ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం జరగుతుందన్నారు లేఖలో చంద్రబాబు. పరిస్థితి చేయి దాటక ముందే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను తక్షణమే అరికట్టాలి. సహజ వనరులను కాపాడుకోవడం చాలా ముఖ్యం అన్నారు సీఎస్ జవహర్ రెడ్డికి రాసిన లేఖలో చంద్రబాబు.

Read Also: Mani Ratnam : కమల్ తో ప్రోమో షూట్ కు రెడీ అంటున్న మణిరత్నం

Exit mobile version