Site icon NTV Telugu

CM Chandrababu: రేపటి ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీకి కేంద్రంగా అమరావతి..!

Chandrababu Naidu

Chandrababu Naidu

CM Chandrababu: రేపటి ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీకి కేంద్రంగా అమరావతి..!అమరావతిలో సాంకేతిక రంగం సంబంధించి మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వదేశీ తయారీ క్వాంటం కంప్యూటర్ దేశానికి గర్వకారణమని, అమరావతి క్వాంటం వ్యాలీ రాష్ట్రానికే కాకుండా దేశానికీ ప్రతిష్ఠను తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు.

Vijayawada: కలెక్టరేట్‌లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీతో పాటు, మేధా టవర్స్‌లో 1Q పేరిట మరో క్వాంటం సిస్టమ్‌ను ప్రారంభించారు. ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ క్వాంటం ఉపకరణాలను పరీక్షించడానికి, సర్టిఫై చేయడానికి కీలక వేదికలుగా నిలవనున్నాయి. పరిశోధకులు, విద్యార్థులు, కంపెనీలు క్వాంటం టెక్నాలజీని వినియోగించుకునేలా వీటి ద్వారా అవకాశాలు విస్తరించనున్నాయి. క్వాంటం సైన్స్‌కు వందేళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రపంచ క్వాంటం దినోత్సవం రోజున ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం గర్వకారణమని సీఎం అన్నారు.

టెక్నాలజీని అర్థం చేసుకుని ప్రోత్సహించే నాయకత్వం దేశానికి అవసరమని, ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధానిగా ఉండటం దేశానికి అదృష్టమని వ్యాఖ్యానించారు. అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కార్యదర్శి అభయ్ కరాండికర్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ క్వాంటం ఫెసిలిటీలు వాస్తవ రూపం దాల్చడం విశేషమని పేర్కొన్నారు.

Vijayawada: కలెక్టరేట్‌లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!

క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించే కీలక శక్తిగా మారనుందని సీఎం అన్నారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్ ఎంత ముఖ్యమో, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్ ఎంత అవసరమో, ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటం టెక్నాలజీ కూడా అంతే కీలకమని వివరించారు. ఈ రంగంలో ముందంజలో ఉన్న దేశాలే భవిష్యత్తును శాసించే అవకాశముందని సీఎం అన్నారు.

Exit mobile version