CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Schedule Today: నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అంబాజీపేట మండలంలో పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు ఇరుసుమండ హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అనంతరం మాచవరం జయంతినగర్‌లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు.
ఆ తర్వాత పండువారిపేటలో నిర్వహించే గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. గ్రామసభలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించడంతో పాటు రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజలతో సీఎం మమేకం కానున్నారు. మధ్యాహ్నం బుడుంగపేటలో టీడీపీ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. స్థానికంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కూడా సీఎం సూచనలు చేసే అవకాశం ఉంది.
Also Read
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం జెడ్ ప్లస్ భద్రతా పరిధిలో ఉన్నందున సీఎంవో ఆదేశాల మేరకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం పర్యటన సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. పర్యటన ముగించుకుని చంద్రబాబు సాయంత్రం 4:55 గంటలకు ఇరుసుమండ నుంచి ఉండవల్లికి బయలుదేరనున్నారు.
తాజావార్తలు
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?