Site icon NTV Telugu

Chandrababu: రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి..

Babu

Babu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. చిత్తూరులో వైసీపీ మూకల దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోవడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయింది అని విమర్శలు గుప్పించారు. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయింది.. తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోయేలా చేశారన్నారు. భర్త లేకున్నా.. దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Sharuk Khan : షారుఖ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ‘ పఠాన్‌’ మళ్లీ వచ్చేస్తున్నాడు..

ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైనా దాడులు నిత్యకృత్యంగా మారాయని చంద్రబాబు మండిపడ్డారు. మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించండి.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హంసవేణి కంటి చూపు కోల్పోయిన ఘటనపై సీఎం జగన్ స్పందించాలి అని కోరారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version