NTV Telugu Site icon

Chandrababu: ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి ఈ రౌడీలను తరిమి కొట్టాలి..

Chandrababu

Chandrababu

అధికారాన్ని కోల్పోవడం ఖాయమని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా విమర్శలు గుప్పించారు. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా, క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు అని మండిపడ్డారు. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన జన స్పందన చూసి ఓర్వలేక ఈ పని చేసారు.. రౌడీయిజం, విధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం.. ఇదే వైసీపీ వాళ్ళ నైజం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి వైసీపీ రౌడీలను తరిమి కొట్టాలని కోరుతున్నాను.. అలాగే, సత్తెనపల్లిలో దివ్యాంగులు నన్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు అని చంద్రబాబు తెలిపారు.

Read Also: Rohit Sharma: ‘వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు..’ డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ స్పీచ్..!

తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు నెలకు 6 వేల రూపాయల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇస్తున్నాను అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని పేర్కొన్నారు. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే అంటూ ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి యేటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేసామన్నారు. దివ్యాంగుల కోసం టీడీపీ అమలు చేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది.. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు.