CM Chandrababu Birthday: అన్న క్యాంటీన్లో చంద్రబాబు దంపతులు.. పేదలతో కలిసి సీఎం అల్పాహారం!
- పటమటలోని అన్న క్యాంటీన్లో చంద్రబాబు దంపతులు
- పేదలతో కలిసి అల్పాహారం చేసిన సీఎం దంపతులు
- అన్న క్యాంటీన్లలో ఆ రోజు ఉచిత ఆహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్వయంగా పేదలకు అల్పాహారం వడ్డించి.. వారితో పాటు కూర్చొని భోజనం చేయడం విశేషం. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఒకరోజు ఖర్చుగా రూ.76 లక్షలను భువనేశ్వరి విరాళంగా అందించారు. ఈ విరాళంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఆ రోజు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. అన్ని క్యాంటీన్లలో మూడు పూటలా అన్నదానం నిర్వహించనున్నారు.
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పటమట అన్న క్యాంటీన్ వద్ద భారీ సందడి నెలకొంది. క్యాంటీన్ వద్దకు ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ‘హ్యాపీ బర్త్ డే సీఎం సార్’ అంటూ నినాదాలు చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. నేటితో చంద్రబాబు 76వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మంత్రి నారా లోకేశ్ సహా హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషెష్ చెప్పారు.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
- England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
తాజావార్తలు
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్‌ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?