Site icon NTV Telugu

AP Governor: నూతన గవర్నర్‌తో చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ

Chandrababu

Chandrababu

AP Governor: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో పాటు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య తదితరులు గవర్నర్‌ను కలిశారు. నేతలందరినీ చంద్రబాబు గవర్నర్‌కు పరిచయం చేశారు.

Read Also: Biswa Bhusan Harichandan: ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రమాణం

గవర్నరుగా తాను లెర్నర్‌నని ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటున్నానని నేతలతో జస్టిస్ అబ్దుల్ నజీర్ సరదాగా మాట్లాడారు. నేతలందరినీ పరిచయం చేసుకున్నాక చంద్రబాబుతో విడిగా దాదాపు 40 నిమిషాలు పాటు సమావేశమయ్యారు. రాష్ట్ర తాజా పరిస్థితులపై నూతన గవర్నర్‌తో చంద్రబాబు చర్చించారు. వివిధ పరిణామాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Exit mobile version