Site icon NTV Telugu

Chandrababu: పవన్‌ కళ్యాణ్‌ ఇంటికి చంద్రబాబు.. కారణమేంటంటే?

Chandrababu

Chandrababu

Chandrababu Meets Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పవన్‌ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి భేటీలో పొత్తులకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read Also: PM Modi: మంచి మనసు చాటుకున్న ప్రధాని మోడీ.. కాన్వాయ్‌ను ఆపి..!

ఇరువురు నేతలు సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా? వద్దా? అన్నదానిపై చర్చించినట్లు సమాచారం. పవన్ చంద్రబాబు మధ్య సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టతపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం.

 

Exit mobile version