NTV Telugu Site icon

CM Chandrababu: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. మరో రెండు నెలల తర్వాత ఏపీ బడ్జెట్!

Cm

Cm

విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందని ఆరోపించారు. ఆర్థిక గందరగోళ పరుస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలపాలని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని ఆరోపించారు.

Vijay Devarakonda Photo: ఎలా ఉండే వాడు, ఎలా అయ్యాడు.. విజయ్ దేవరకొండను గుర్తుపట్టడం కష్టమే!

ఏపీలో అత్యధిక మెజార్టీ సాధించిన గాజువాక ఎమ్మెల్యే పల్లాకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. పవన్ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారు.. రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని చంద్రబాబు తెలిపారు. ఓట్లు చీలకూడదు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ సామాజిక బాధ్యతతో ఆలోచించారన్నారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పని చేస్తామని తెలిపారు. గత ఐదేళ్లల్లో ప్రజలకు నరకం అంటే ఏంటో చూపించారు చంద్రబాబు పేర్కొన్నారు. మెడ మీద కత్తి పెట్టి భూములు, ఆస్తులు రాయించుకున్నారని అన్నారు. ఆడబిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ లేదు.. సభలో ఉన్న సగం మంది ప్రత్యక్షంగా.. మరి కొంత మంది పరోక్షంగా గత ప్రభుత్వ బాధితులేనని తెలిపారు. స్పీకర్ అయ్యన్న లాంటి వ్యక్తి మీదే అత్యాచార యత్నం కేసు పెట్టారంటే బాధేస్తోందని చెప్పారు. అచ్చెన్నాయుడు, నారాయణ వంటి వారిని గత ప్రభుత్వం విపరీతంగా హింసించిందని ముఖ్యమంత్రి తెలిపారు.

Harish Rao: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు..

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అభివృద్ధి చేసే అమరావతి పోయింది.. జీవనాడి పోలవరం పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదేనని కేంద్రం చెప్పింది.. సంతోషం అని తెలిపారు. ప్రాజెక్టులు.. ప్రాజెక్టుల గేట్లు కూడా కొట్టుకుపోయాయి.. ఆ ప్రాజెక్టు గేట్లు పెట్టడానికి కూడా నిధులివ్వలేదన్నారు. అరాచకాలు చేసి.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన వ్యక్తి ప్రజాస్వామ్యం కాపాడాలంటూ ప్లకార్డు పట్టుకున్నారని దుయ్యబట్టారు. అమర్నాధ్ గౌడ్ అనే పదో తరగతి బాలుడిని పెట్రోల్ పోసి తగులబెట్టారని మండిపడ్డారు. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తనను ఇదే సభలో అవమానించారు.. కౌరవ సభలో ఉండను.. గౌరవ సభలో ఉంటానని వెళ్లిపోయానని చంద్రబాబు చెప్పారు.
బాధితులనే నిందితులను చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కింది.. ఇన్ని చేసి ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్లారని చంద్రబాబు చెప్పారు.