MP Bharat: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కామ్ ల రాజా అని, పాపం పండి నేడు పోలీసులు అరెస్టు చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారని, వారి ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. సాక్ష్యాధారాలు అన్నీ సేకరించిన తరువాత ఒకటికి రెండు మూడు సార్లు సమగ్రంగా పరిశీలించిన పిమ్మటే పోలీసులు రంగంలోకి దిగి చంద్రబాబును అరెస్టు చేశారని వివరించారు.
Read Also: IND vs PAK Live Updates: భారత్-పాక్ మ్యాచ్.. భారత ఓపెనర్లు ఔట్
రాజమండ్రి 37వ వార్డులో పలువురు యువకులు వైసీపీ పార్టీలో చేరిన సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇస్తామని నమ్మించి, ఆ ప్రాజెక్టు ముసుగులో రూ. 371 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని వివరించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలలో ఇదొకటని, అమరావతి భూముల స్కాం, పోలవరం ప్రాజెక్టులో నిధుల స్వాహా..ఇలా అనేకం ఉన్నాయన్నారు. చంద్రబాబు నక్కజిత్తుల డ్రామాలను ఇంకా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.
Read Also: Maharashtra : వీడు అసలు తండ్రేనా.. పసికందును నేలకేసి కొట్టి..
మరోవైపు వైసీపీ నేతలు ఇప్పటికే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు కోసం అందరు ఎదురుచూస్తుండగా.. తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇక, చంద్రబాబును నంద్యాలలో శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.