Chandrababu Health: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, బరువు 67 కేజీలు ఉన్నారని అధికారులు బులెటిన్‌లో తెలిపారు. జైలు డాక్టర్లు పరీక్షలు చేసి నివేదిక ఇచ్చారని తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై 5వ రోజు హెల్త్ బులిటెన్‌ను సెంట్రల్ జైల్ ఇంఛార్జి సూపరిండెంట్ రాజ్ కుమార్ విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్ బులెటిన్‌పై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయడం లేదంచూ ఆయన తరఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై మంగళవారం విచారణ చేపడతామని న్యాయస్థానం వెల్లడించింది.
Also Read: Indrakeeladri Temple: గాయత్రిదేవిగా దుర్గమ్మ దర్శనం.. మొదటిరోజు కంటే తక్కువగానే..
నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
*బీపీ-136/80
*ఉష్ణోగ్రత – సాధారణం
*పల్స్- 64/మినిట్
*SPO2 -97 శాతం
*రెస్పిరేటరీ రేటు- 12/మినిట్
*వెయిట్- 67కేజీలు
*ఊపిరితిత్తులు – క్లియర్
*ఫిజికల్ యాక్టివిటీ… గుడ్