Chandrababu Arrest: మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు అంటున్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్నేహితులు.. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు ఆయన స్నేహితులు.. ఇక, మా స్నేహం మీద ఒట్టు చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు అంటున్నారు ఆయన స్నేహితులు.. చంద్రగిరిలో 14వ రోజు రిలే నిరాహారదీక్షలో ఆయన చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు.. చుట్టుపక్కల గ్రామాల నుంచి చంద్రగిరి స్కూల్‌కు నడచి వచ్చి చదువుకున్నాం.. చంద్రబాబు కష్టం విలువ తెలిసిన వ్యక్తి.. ప్రభుత్వం మూర్ఖత్వంతో మంచితనానికి మచ్చ వేయాలని చూస్తోందని విమర్శించారు.
Read Also: Telangana: గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. జిల్లా ఆసుపత్రుల్లోనే క్యాన్సర్‌కు చికిత్స..
ముఖ్యమంత్రి హోదాలో కూడా పార్టీలకు అతీతంగా వ్యవహరించిన వ్యక్తి చంద్రబాబు అంటున్నారు ఆయన స్నేహితులు.. కుట్ర, కుతంత్రాలు, నీతిమాలిన రాజకీయాలు ఆయనకు తెలియవు.. ప్రజలకు సేవ చేయడం మాత్రమే ఆయనకు తెలుసని చెబుతున్నారు చంద్రబాబు స్నేహితుల. మరోవైపు.. నగరి నుండి తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి వరకు టీడీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ, బాబు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ నగరి నుండి తిరుత్తణి వరకు పాదయాత్ర చేపట్టారు.. పాదయాత్రలో నగరి నియోజకవర్గ ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం విదితమే.. ఆయన తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇటు ఏసీబీ కోర్టు, హైకోర్టు.. అటు సుప్రీంకోర్టులోనూ విచారణ సాగుతోంది.