Site icon NTV Telugu

Chandrababu: అమరావతి రాజధానిగా ఉంటుంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu

Chandrababu

Chandrababu: ముఖ్యమంత్రి పదవి కోసం, పవన్‌కు అధికారము కోసం ఈ పోరాటం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తునిలో ‘రా కదలిరా’ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో రాజకీయం మారిపోయిందని ఆయన అన్నారు. జగన్ పని అయిపోయిందని.. జీవితంలో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. దేశం మొత్తం మీద పెట్రోల్ ధర రాష్ట్రంలోనే ఎక్కువ అని చంద్రబాబు అన్నారు. యువత తొంభై రోజులు సైకిల్ ఎక్కి గ్లాస్‌లో నీళ్లు తాగి ప్రజలను చైతన్యం చేయాలని ఆయన సూచించారు. టీటీడీలో నాసి రకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందొద్దని.. మీకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. కప్పం కట్టలేక పరిశ్రమలు పారిపోతున్నాయని ఆయన మండిపడ్డారు.

Read Also: Kesineni Nani: లోక్‌సభ సభ్యత్వానికి కేశినేని నాని రాజీనామా

రైతులు, కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటామన్నారు. కాపులు, అగ్ర వర్ణాలకి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఈ దుర్మార్గుడు పక్కన కూర్చోపెట్టుకున్నాడన్నారు. సీఎం జగన్‌ మూడు రాజధానులు అని నాటకాలు ఆడారని.. అమరావతి రాజధానిగా ఉంటుందన్నారు. జగన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి..అంతా రివర్స్ గేర్ అంటూ విమర్శించారు. జగన్‌కి సీన్ అర్థం అయిపోయిందని.. దేశంలో నెంబర్ 1 పెత్తందారు జగన్ అంటూ మండిపడ్డారు.

మంత్రి దాడిశెట్టి రాజా అక్రమాల రాజా, వసూళ్ల రాజా అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు అక్కడ ఎమ్మెల్యే అంటూ.. మంత్రిపై చంద్రబాబు ఆరోపించారు. జగన్ బినామీ మదం తగ్గిస్తానన్నారు. బియ్యం మాఫియాకి కర్మ, కర్త, క్రియ ఆయన అంటూ ఆరోపించారు. జిల్లాలో ఏమి జరిగిన ద్వారంపూడి కేంద్రంగానే జరుగుతాయన్నారు. మంత్రి మామూళ్ల దెబ్బకు వ్యాపారులు పారిపోతున్నారని ఆరోపణలు చేశారు. తూర్పుగోదావరిలో పెత్తనం మిధున్ రెడ్డి చేస్తున్నాడన్నారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు సీట్లు మార్చాడని.. ముఖ్యమంత్రిని ప్రజలు వద్దు అంటున్నారని వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడు ఎవరిని మార్చలేదన్నారు. అనపర్తి, కాకినాడ, కొత్తపేట ఎమ్మెల్యేలను ఎందుకు మార్చలేదు…వాళ్ళు రెడ్లు కాబట్టి మార్చలేదా అంటూ ప్రశ్నించారు. కోడి పందాలు మన నాగరికత, మన సంస్కృతిలో భాగమన్న చంద్రబాబు.. గోదావరి జిల్లాలో కోళ్లు రెడీ అయిపోతున్నాయన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పోలీసులకు అదే చెప్పానని.. సాంప్రదాయం విషయంలో రాజీపడకూడదన్నారు.

 

Exit mobile version