NTV Telugu Site icon

Chandrababu Fan : చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిన గుండె.. నివాళులు అర్పించిన టీటీడీపీ నేతలు

Cbn Fan

Cbn Fan

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం, తదనంతర వ్యవహారాలను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు అభిమానులైతే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని వివేకానంద నగర కాలనీ వాస్తవ్యులు, బాలాజీ నిలయం అపార్ట్మెంట్ లో నీవసిస్తున్న తెలుగుదేశం పార్టీ వీర అభిమాని వెంకటేశ్వర రావు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును జైలు కి తరలించడం తట్టుకోలేక కలత చెంది గుండె పోటు తో కాలం చేసారు.. దీంతో.. ఆయన పార్థివ దేహంపై పార్టీ జెండా కప్పి వారికి నివాళ్లు అర్పించి, వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ , టీటీడీపి నాయకులు. వెంకటేశ్వర రావు ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ కార్యకర్తలు వారి కుటుంబాన్ని సంతాపం తెలిపారు.

Also Read : Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

అయితే.. చంద్రబాబు నాయుడుపై అవినీతి కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు ఆదివారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. రూ.371 కోట్ల ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఆయనను శనివారం అరెస్టు చేసింది. 2014లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడంతోపాటు అనంతపురం జిల్లాలోని కియా వంటి పరిశ్రమల సమీపంలోని విద్యా సంస్థలతో సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఏర్పాటుకు సంబంధించిన కేసు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత ‘ముఖ్య కుట్రదారు’గా వ్యవహరించారని, ఏపీఎస్‌ఎస్‌డీసీ ముసుగులో రూ.371 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని దర్యాప్తు అధికారులు ఆరోపించారు.

Also Read : Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Show comments