Chandrababu Couple: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు వారికి ఘన స్వాగతం పలికాయి. ముఖ్యమంత్రి దంపతులు ఆప్యాయంగా తెలుగు వలసదారులతో మాట్లాడారు. ఈ పర్యటనలో వ్యక్తిగత అంశాలతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంకు కూడా హాజరుకానున్నారు. నవంబర్ 4న లండన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ అవార్డులను అందుకోనున్నారు.
ఇందులో మొదటగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఆమె చేసిన ప్రజాసేవ, సామాజిక ప్రభావం (Public Service and Social Impact) రంగాల్లో విశేష కృషిని గుర్తిస్తూ “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 (Distinguished Fellowship 2025)” అవార్డుతో సత్కరించనున్నారు. ఈ గుర్తింపు భువనేశ్వరి సామాజిక సేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టనుంది. ఇక మరొక అవార్డు విషయానికి వస్తే.. ఆమె ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు “గోల్డెన్ పీకాక్ అవార్డు (Golden Peacock Award)” లభించింది. ఈ అవార్డును ఆమె హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (VCMD) హోదాలో స్వీకరించనున్నారు. దీనితో నారా భువనేశ్వరి అవార్డు స్వీకరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
Australia vs India 3rd T20I: టిమ్ డేవిడ్, స్టోయినిస్ దూకుడు.. టీమిండియా ముందు భారీ టార్గెట్..!
