NTV Telugu Site icon

Chandrababu: ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. ఉగాది రోజు ప్రజలు సంకల్పం తీసుకోవాలి..

Babu

Babu

Chandrababu: ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. ఇదే నినాదంతో పని చేయాలి.. తెలుగు జాతికి పూర్వ వైభవం వచ్చేలా ఉగాది రోజున ప్రజలు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్ నిర్మాణం జరగాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని కూటమిగా ఏర్పడ్డాం అన్నారు.. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం అవసరం.. వచ్చేది కూటమి ప్రభుత్వమే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. సమాజంలో సైకో జగనుకు స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే. సూపర్ సిక్స్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి డిపాజిట్లు రావని.. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం అని ప్రకటించారు.

Read Also: Pawan Kalyan: పిఠాపురం జనసేన కార్యాలయం నా స్వగృహం.. విజయకేతనం ఎగరవేస్తున్నాం..

వృద్ధులకు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన పార్టీనే టీడీపీయే అన్నారు చంద్రబాబు.. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 2000 చేసిన ఘనత టీడీపీదే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకు రూ. 4000, దివ్యాంగులకు రూ. 6000 పెన్షన్ ఇస్తాం అన్నారు. రాష్ట్రానికి రూ. 14 లక్షల అప్పు ఉంది.. అవి తీర్చాలన్న ఆయన.. టీడీపీ హయాంలో ముస్లింలకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. పేదరికం లేని సమాజం.. ఇది ఎన్టీఆర్ ఆదేశం.. దీన్ని సాధించడానికి నేను సంకల్పం తీసుకున్నాను అన్నారు. పెన్షన్లు పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను ఎండలో నిలబెట్టారు. ఇది కొత్త వార్త.. వలంటీర్ల వ్యవస్థే లేదంట. వాలంటీర్ల వ్యవస్ఖను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా..? వాలంటీర్ల వ్యవస్థపై తొలి సంతకం అంటే.. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్ఖ లేనట్టేగా..? అని ప్రశ్నించారు. జగన్ వాలంటీర్లను మోసం చేస్తున్నారన్న ఆయన.. జగన్ ఎంత స్వార్ధపరుడో వాలంటీర్లు అర్ధం చేసుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాం.. వారికి రూ. 10 వేలు గౌరవ భృతి కల్పిస్తాం అన్నారు. ఇదే కాకుండా వలంటీర్లల్లో చదువుకున్న వారికి అద్భుతమైన ఉపాధి కల్పిస్తాం. తప్పుడు పనులు చేసి వాలంటీర్లు జైలుకు వెళ్లొద్దు.. రాష్ట్ర ప్రగతితో వాలంటీర్లు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

Read Also: Bellamkonda Sreenivas: మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక రచ్చ రచ్చే!

తెలుగు వారికి శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.. దశా, దిశా నిర్దేశం చేసుకోవడానికి ఉగాది పండుగ ఓ వేదిక. తెలుగు వారికి కొత్త ఏడాది ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది. ప్రకృతికి, పండుగలకు సంబంధం ఉంది. చైత్ర మాసం నుంచి ప్రజా చైతన్యం వెల్లువెత్తాలి. మంచి రోజులు రావాలని అందరూ సంకల్పం తీసుకోవాలి. ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి. ధరలు తగ్గాలి, శాంతి భధ్రతలు ఉండాలి, అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందాలి. సంపద సృష్టించాలి.. ఆ సంపదను మంచికి ఉపయోగించాలని ఆకాక్షించారు చంద్రబాబు.. ఆర్యవైశ్యులు తాము సంపాదించిన దాంట్లో కొంత భాగం బాధ్యతగా ప్రజా సేవ కోసం ఖర్చు పెడతారు. మంచి, చెడు అన్నింటిని సమానంగా చూడాలనే తత్వంతో ఉగాది పచ్చడన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో మంచి లేదు.. అంతా చెడే.. మొత్తం చేదు, కారంగానే మార్చారని ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరుతో పది రూపాయలిచ్చి.. రూ. 100 లాగేస్తున్నారు. పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను వైసీపీ అమలు చేస్తోంది. ఉగాది రోజున మళ్లీ మంచి రోజులు రానున్నాయనే సంకల్పం తీసుకోవాలి. ప్రజలకి అండగా ఉండేందుకే ఓ కూటమిగా వచ్చాం. విభజన తర్వాత పెన్షన్లు ఇవ్వగలమా..? లేదా..? అని ఆందోళన ఉండేది. కానీ, సంపద సృష్టించి పేదలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పని చేశాం అని గుర్తుచేసుకున్నారు.. అనేక పరిశ్రమలు తెచ్చాం. రూ. 16 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నాం. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ నుంచి మహా ప్రస్థానం వాహానాల వరకు పేదలకు అండగా నిలిచాం. పుట్టుక నుంచి చనిపోయే వరకు పేదలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీయే అన్నారు. సంక్షేమాన్ని పేదలకు పరిచయం చేసిందే టీడీపీ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.