NTV Telugu Site icon

Chandrababu Arrested: చంద్రబాబు అరెస్ట్‌.. ఉద్రిక్తత..

Chandrababu

Chandrababu

Chandrababu Arrested: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్‌ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు.. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీసు ఇచ్చారు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు.. చంద్రబాబు బాబుపై 120(బీ), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.. అయితే, ఎఫ్‌ఐఆర్‌ లేదు.. నోటీసు లేదు.. ఏదో జరిగిందని కేసులు పెడుతున్నారు.. స్కిల్‌ స్కామ్‌ కేసులో నా పేరు ఎక్కడ ఉందో చూపించండి.. ప్రాథమిక ఆధారాలు లేకుండా నన్ను ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ అధికారులను నిలదీశారు చంద్రబాబు.. ఇక, విజయవాడ మూడో ACM కోర్టుకు చంద్రబాబును తరలించే అవకాశం ఉంది.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు పోలీసులు.. టీడీపీ నాయకులు బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు.

అయితే, అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు వచ్చారు పోలీసులు.. డీఐజీ రఘురామ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.. 3 గంటల సమయంలో ఎందుకు రావాల్సి వచ్చింది అని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వద్దకు అర్థ రాత్రి రావాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.. అయితే, చంద్రబాబుతో తప్ప ఎవ్వరికీ సమాధానం చెప్పమని స్పష్టం చేశారు పోలీసులు.. ఇక, చంద్రబాబు బస చేసిన బస్సు దగ్గర నుంచి టీడీపీ నేతలను, పార్టీ శ్రేణుల పంపించారు పోలీసులు.. చంద్రబాబు బస్సు చుట్టూ రోప్ ఏర్పాటు చేశారు.. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ను వారి కంట్రోల్‌లోకి తీసుకున్నారు.. బస్సు దగ్గరకు పొక్లైనర్ తెచ్చారు.. కానీ, చంద్రబాబు తరపు అడ్వకేట్లపై రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. రఘురామిరెడ్డి తీరును చంద్రబాబు బప్పుబట్టారు.. మొత్తంగా ఉదయం 5.30 గంటల తర్వాత చంద్రబాబు బస్సు నుంచి బయటకు రావడం.. ఆయను అరెస్ట్ చేయడం జరిగిపోయాయి.

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏ1గా చేర్చింది సీఐడీ.. షెల్ కంపెనీ ద్వారా రూ. 241 కోట్ల కుంభకోణం జరిగిందని అభియోగాలు మోపారు.. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో సీఐడీ, ఈడీ విచారణ సాగుతోంది.. ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో 8 మందిని అరెస్ట్‌ చేశారు.. డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు ఈడీ అధికారులు.. స్కిల్ కేసులో మాజీ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ, ఘంటా సుబ్బారావులను గతంలోనే సీఐడీ విచారించిన విషయం విదితమే. అయితే, ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది.. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఆందోళనకు తావులేకుండా.. టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నారు పోలీసులు. చంద్రబాబు నాయుడుకి హెల్త్ చెకప్ చేశారు.. బీపీ, షుగర్ చేక్‌ చేశారు వైద్యులు.. ఆయన్ని రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలించనున్నారు.