NTV Telugu Site icon

CM’s Meeting : ముగిసిన సీఎంల భేటీ.. విభజన సమస్యలపై కీలక నిర్ణయం

Meeting

Meeting

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది. అయితే.. ముందుగా ఒకరినొకరు ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా శాలువాలతో సత్కరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు’కాళోజీ-నాగొడవ’ పుస్తకాన్ని బహుకరించారు రేవంత్‌ రెడ్డి.

అయితే… ప్రజాభవన్‌లో కొనసాగిన ఈ భేటీలో విభజన సమస్యలను చర్చించారు. విభజన అంశాలపై లోతుగా చర్చ జరిగింది. అయితే.. ఐదు గ్రామాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. విద్యుత్‌ బకాయిలపై ఏపీ ప్రస్తావించగా.. బకాయిలు చెల్లించేది లేదన్న తెలంగాణ వెల్లడించింది.. ఏపీ ప్రభుత్వమే విద్యుత్‌ బకాయి పడ్డారని తెలంగాణ తెలిపింది. విద్యుత్‌ బకాయి లెక్కలు సీఎంల ముందుంచారు ఇరు రాష్ట్రాల అధికారులు.

ఇకపోతే.. విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై చర్చించిన ముఖ్యమంత్రులు.. హైదరాబాద్‌లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అయితే… హైదరాబాద్‌లో ఉన్నస్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయని చెప్పిన రేవంత్‌.జ స్థిరాస్తులు ఏపీకి ఇవ్వడానికి నిరాకరించినట్లు పేర్కొన్నారు. ఐదు గ్రామాల వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చివరగా విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయనున్నట్లు.. మంత్రులు కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం, శ్రీధర్‌బాబు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.