ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పంట నష్టం అంచనాలకు సంబంధించిన సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఈనెల 25న వస్తుంది అని స్పష్టం చేశారు. రైతు భరోసాతో కలిపి ఇన్ ఫుట్ సబ్సిడీ అందజేస్తాం అని ఆయన వెల్లడించారు. ఇన్ ఫుట్ సబ్సిడీ సీజన్ ముగిసే లోపే చెల్లిస్తున్నాం అని మంత్రి కాకానీ అన్నారు.
Also Read : Delhi: భార్యా పిల్లలను కడతేర్చిన కసాయి.. చివరకు ఇంటర్నెట్‌లో చదివి భర్త ఆత్మహత్య..
అకాల వర్షాలతో తడిచిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అసహ్యన్నీ జయించిన నాయకుడు చంద్రబాబు.. ఆయన మాటలు పట్టించుకోవాలిసిన అవసరం లేదు మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకుంటారనే సమాచారం తెలిసే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి తుఫానులు రాకుండా కూడా అడ్డుకున్నామని గొప్పలు చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి కాకానీ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీకి కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
Also Read : Expensive Places: ఇక్కడ నివసించాలంటే.. బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉండాలా!
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓర్వలేకపోతున్నారు.. వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని మంత్రి కాకానీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకుని వైసీపీని ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నారు.. కానీ వైసీపీ పార్టీ మాత్రం 175 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని మంత్రి కాకానీ గోవర్థన్ రెడ్డి అన్నారు.
