NTV Telugu Site icon

Chandigarh Case: మైనర్ పై అత్యాచారం చేసిన 45 ఏళ్ల వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్ష వేసిన కోర్టు

Chandigarh

Chandigarh

Chandigarh Case: చండీగఢ్‌లో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో 45 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం స్థానిక కోర్టు ఈ 3 సంవత్సరాల కేసులో తీర్పు ఇచ్చింది. నిందితుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాలిక గర్భవతి అయింది. దోషి ఇషామ్ సింగ్ చంచల్‌కు కోర్టు రూ.30,000 జరిమానా కూడా విధించింది. ఈ కేసు 2020 సంవత్సరానికి చెందినది. ఇషామ్ సింగ్ చంచల్ పొరుగున నివసిస్తున్న ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు.

Read Also:Protein Foods: వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే.. జిమ్‌కి వెళ్లకుండానే మీ నడుము సన్నబడుతుంది!

ఈ విషయమై సారంగపూర్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. వీటిలో ఇషామ్ సింగ్ చందేల్‌తో పాటు, మైనర్ సోదరుడు, అతని స్నేహితుడిపై (ఇద్దరూ 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) కేసు నమోదు చేశారు. వారిపై సెక్షన్ 376 (3), సెక్షన్ 6 (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.

Read Also:Ravi Teja: రీమేక్‌కి రవితేజ గ్రీన్ సిగ్న‌ల్‌… లైన్‌లోకి ప‌వ‌న్ డైరెక్ట‌ర్‌..!

బాలిక గర్భిణి అనే సమాచారం తెలుసుకుని ఆస్పత్రికి వెళ్లగా అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె మైనర్ కావడంతో ఆసుపత్రి వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత బాలిక తన సోదరుడు, స్నేహితుడి గురించి సమాచారం ఇచ్చింది. పోలీసులు మైనర్‌కు కౌన్సెలింగ్ చేయగా, పొరుగువారి ఇషామ్ సింగ్ చంచల్ పేరు తెరపైకి వచ్చింది. ఇషామ్ అప్పటికే బాలిక కుటుంబంలో క్యాటరింగ్ సర్వీస్‌లో పనిచేశాడు. నిందితులు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక వెల్లడించింది. సంఘటన బహిర్గతం అయిన తర్వాత, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తరువాత DNA దర్యాప్తులో ఇషామ్ సింగ్ చంచల్ పేరు నిర్ధారించబడింది. మైనర్ సోదరుడు, అతని స్నేహితుడిని కోర్టు ఈ శనివారం (జూలై 15) నిర్దోషులుగా ప్రకటించింది. కాగా ఈ కేసులో ఇషామ్‌కు 20 ఏళ్ల శిక్ష పడింది.