NTV Telugu Site icon

BCCI: బీసీసీఐకి వచ్చే ఐదేళ్లలో భారీ ఆదాయం వచ్చే ఛాన్స్..!

Bcci

Bcci

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకి వచ్చే ఐదు సంవత్సరాలలో సుమారు రూ.8,200 కోట్లు ఆదాయం సమకూర్చుకునేందుకు బీసీసీఐ అంచనా వేస్తోంది. ఇది కేవలం సొంతగడ్డపై టీమిండియా ఆడే మ్యాచ్‌లకు మాత్రమే వచ్చే ఆదాయంగా తెలిపింది. భారత జట్టు వచ్చే ఐదేళ్లలో సొంతగడ్డపై 88 మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ సన్నాహాలు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లకు సంబంధించి మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ రూ. 8,200 కోట్లు రానున్నట్లు తెలిపింది. మీడియా హక్కుల అమ్మకానికి ఇప్పటికే బోర్డు టెండర్లకు పిలిచింది.

Read Also: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్

ఈ ఐదేళ్లలో స్వదేశంలో భారత్ జట్టు 25 టెస్టు మ్యాచ్‌లు, 27 వన్డే మ్యాచ్‌లు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ రెడీ చేసింది. ఇందులో ఆసీస్‌తో 21 మ్యాచ్‌లు, ఇంగ్లాండ్‌తో 18 మ్యాచ్‌లు ఉన్నాయి. 2018 – 2023 ఐదేళ్ల కాలంలో బీసీసీఐ మీడియా హక్కుల ద్వారా రూ. 6,138 కోట్లు సంపాదించింది. స్టార్ ఇండియా డిజిటల్, టీవీ హక్కులను దక్కించుకుంది. ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ ధర రూ. 60కోట్లు.. అయితే, ఈసారి.. టీవీ, డిజిటల్ హక్కులను వేరువేరుగా వేలం ప్రక్రియ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

Read Also: Eye Flu Home Remedies: కండ్ల కలక రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

గత ఐపీఎల్ మీడియా హక్కుల వేలం సమయంలో రిలయన్స్ డిజిటల్ బిడ్‌ను గెలుచుకుంది. దీంతో బీసీసీఐకి రూ.48,390 కోట్లు ఇన్ కమ్ వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్ విధానం మాదిరిగా టీవీ, డిజిటల్ హక్కులకు వేరువేరుగా బిడ్‌లను బీసీసీఐ ఆహ్వానిస్తుంది. ఈ బిడ్డింగ్ విధానం ఈ-వేలం నిర్వహించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ఫస్ట్ వీక్ లో వేలం షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించేందుకు రెడీ అవుతుంది. ఈనెల 25 వరకు దరఖాస్తుల గడువు ముగుస్తుంది.

Read Also: PM Modi: జనగామ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

సెప్టెంబర్‌లో నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు పలు కంపెనీలు ఇప్పటికే రూ.15 లక్షల విలువైన బిడ్ పత్రాలను కొనుగోలు చేశారు. అయితే, ప్రధానంగా టీమిండియా ప్రసార హక్కులను కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. వాటిలో డిస్నీ హాట్‌స్టార్, రిలయన్స్ – వయాకామ్, జీ-సోనీలు ఉన్నట్లు బీసీసీఐ అధికార వర్గాలు తెలిపింది.