Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaminda Vaas: శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ చమిందా వాస్కు ఐపీఎల్లో తొలిసారి కోచింగ్ అవకాశం దక్కింది. 2027 ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా వాస్‌ను నియమించింది. దీంతో కొత్త కోచింగ్ బృందంలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీలంక తరఫున అద్భుత రికార్డు కలిగిన వాస్.. టెస్టుల్లో 355 వికెట్లు, వన్డేల్లో 400 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో వాస్ జాతకానున్నారు. ఇటీవలే యువరాజ్ సింగ్‌ను అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా ఢిల్లీ నియమించిన సంగతి తెలిసిందే.
గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన మునాఫ్ పటేల్ స్థానంలో చమిందా వాస్ కీలక బాధ్యతలు స్వీకరించనున్నారు. 52 ఏళ్ల వాస్ గతంలో శ్రీలంక పురుషుల జట్టుకు మూడు విడతల్లో బౌలింగ్ కోచ్‌గా సేవలందించారు. వాస్ కోచింగ్ కెరీర్ న్యూజిలాండ్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు శ్రీలంక జట్టుకు కోచ్‌గా పనిచేశారు. 2016 టీ20 ప్రపంచకప్ సమయంలో ఐర్లాండ్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత మరోసారి శ్రీలంక కోచింగ్ బృందంలో చేరారు. ఆటగాడిగా కూడా వాస్కు ఐపీఎల్ అనుభవం ఉంది. 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన ఆయన.. 13 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టారు. ఇప్పుడు తొలిసారి ఐపీఎల్లో కోచ్‌గా అడుగుపెట్టనున్న వాస్.. ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టనున్నారు.
Also Read
- Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
- Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
World Cup winner and Sri lanka’s best ever 🔥
Welcome to Tiger Territory, coach 💙❤️ https://t.co/SuVQ9rGHuO
— Delhi Capitals (@DelhiCapitals) October 17, 2026
తాజావార్తలు
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!