Site icon NTV Telugu

Chamala Kiran Kumar Reddy: రాజకీయాలకు కనెక్షన్ లేకుండా బీఆర్ఎస్.. ఇంటి లొల్లులకే సరిపోతోంది!

Chamala Kiran Kumar Reddy

Chamala Kiran Kumar Reddy

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనదు అని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ న్యాయ కోవిధుడు అని, ఆయనకు మద్దతు ఇవ్వకపోవడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయలేమని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు కనెక్షన్ లేకుండా బీఆర్ఎస్ మారిందని, ఇంటి లొల్లిలకే పార్టీ పెద్దలకు సరిపోతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని ఎంపీ చామల గుర్తుచేశారు. ఈరోజు కాంగ్రెస్‌ ఎంపీ చామల మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.

‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ న్యాయ కోవిధుడు. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడానికి కారణమేంటో చెప్పాలి. రాజకీయాలకు కనెక్షన్ లేకుండా బీఆర్ఎస్ మారింది. ఇంటి లొల్లిలకే వాళ్లకు సరిపోతోంది. పార్టీ పేరు మారాక తెలంగాణకు సంబంధం లేకుండా పోయింది బీఆర్ఎస్. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లోను ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని కోరుతున్నా’ అని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

Also Read: Asia Cup 2025: శాంసన్‌‌, సింగ్‌కు షాక్.. ఆసియా కప్‌లో భారత తుది జట్టు ఇదే!

‘బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ చేసిన వాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. పోలీస్ అధికారిగా ఉండి, తన తోటి పోలీసులు చేస్తున్న విధులను కించపరిచేలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో డ్రగ్ కేసులు కాలేదు, విచ్చల విడిగా డ్రగ్స్ ఉపయోగించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు బీఎస్పీ నేతగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడింది మర్చి పోయారా. అప్పట్లో డ్రగ్స్ స్వేచ్చగా దొరుకుతున్నాయంటూ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇపుడు పార్టీ మారాక బీఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ చేస్తోండు. సీఎంగా రేవంత్ బాధ్యత తీసుకున్నాక, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు. మీరు యదేచ్చగా వదిలిపెట్టిన వాళ్లపై కేసులు పెడుతున్నాం. తెలంగాణ ప్రజలను ప్రవీణ్ కుమార్ తప్పు దోవ పట్టిస్తున్నారు’ అని ఎంపీ చామల మండిపడ్డారు.

Exit mobile version