Site icon NTV Telugu

Manipur : వేర్పాటు వాదం కాదు.. జాతుల వైరమే..

Cds Anil Chauhan

Cds Anil Chauhan

Manipur : మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగడానికి కేవలం రెండు జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం తప్ప.. వేర్పాటు వాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ తెలిపారు. మంగళవారం సీడీఎస్‌ చౌహాన్‌ మీడియాతో మాటా్లడారు. మణిపూర్‌లో పరిస్థికి వేర్పాటువాదంతో సంబంధం లేదనా్నరు. అది కేవలం రెండు జాతుల మధ్య ఘర్షణల ఫలితమన్నారు. అది శాంతి భద్రతల సమస్య అని.. రాష్ర్ట ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నట్టు చెప్పారు. తాము పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను కాపాడమన్నారు. మణిపూర్‌లో ప్రస్తుతం ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కారం కావని.. వాటికి కొంత సమయం పడుతుందన్నారు.

Read Also: Trainee Aircraft Emergency Landing: శిక్షణా విమానంలో సాంకేతిక లోపం, తృటిలో తప్పిన పెను ప్రమాదం

మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కూడా నాలుగు రోజుల పర్యటన కోసం సోమవారమే మణిపూర్‌ చేరుకున్నారు. సోమవారం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌తోపాటు గవర్నర్‌తోనూ సమావేశమయ్యారు. మంగళవారం వివిధ మహిళా సంఘాల నేతలతోనూ అమిత్‌ షా సమావేశం నిర్వహించారు. మరో రెండు రోజుల పర్యటనలో కుకీ, మెయితీ వర్గాలతో చర్చలు జరపనున్నారు. రెండు జాతుల మధ్య హింసలో మరణించిన వారికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దాంతోపాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version