NTV Telugu Site icon

Medchal: జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్

Shamirpet

Shamirpet

Chain snatching for easy money.. Two arrested: జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం పెట్ బషీరాబాద్ ఏసీపీ రాములు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈనెల 10వ తేదీన ముడిచింతలపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు మెడలో నుంచి చైన్ స్నాచింగ్ ప్రయత్నించగా విషయం విధితమే. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న షామీర్ పేట్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం దాదాపు 70 సీసీ కెమెరాలును పరిశీలించి బండ్లగూడకి చెందిన అంజి రెడ్డి.. బోలిగూడెంకు చెందిన నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఐటీ కంపెనీలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం కొనసాగించేవారు.

Read Also: Tamil nadu: మళ్లీ చిగురుస్తున్న అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు! అన్నామలై వ్యాఖ్యల్లో మార్పు!

ఈజీ మనీ కోసం అలవాటు పడి నగర శివారులో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన మూడు చింతలపల్లికి చెందిన బసవమ్మ (55) రోడ్డు పైన వడ్లు ఆరబోస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీ పై వచ్చి ఆమె మెడలో ఉన్న 4 తులాల పుస్తెల తాడును చోరీకి ప్రయత్నించారు. దానికి వృద్ధురాలు ప్రతిఘటించడంతో 5 గ్రాముల బంగారం దోచుకెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. శుక్రవారం వారిని షామీర్ పేట్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుండి 5.5 గ్రాముల బంగారం.. ఒక కారు, స్కూటీ, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అంజిరెడ్డి పై మూడు కేసులు ఉన్నాయి. ఇంత చాకచక్యంగా మేడ్చల్ సీసీఎస్ షామీర్ పేట్ పోలీసులు కలిసి నిందితులను పట్టుకున్నందుకు వారికి సీపీ చేతుల మీదుగా రివార్డులు అందజేసినట్లు ఏసీపీ తెలిపారు. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ కోరారు. ఈ సమావేశంలో షామీర్ పేట్ సిఐ శ్రీనాథ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గంగాధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ దల్లినాయుడు, ఎస్సైలు హారిక, తదితరులు పాల్గొన్నారు.

Read Also: Bajaj Chetak 35 Series: కొత్త ఈవీ చేతక్‌ లాంచ్‌ చేసిన బజాజ్.. ఫీచర్లు ఇదిగో..