Bajaj Chetak 35 Series: కొత్త ఈవీ చేతక్ లాంచ్ చేసిన బజాజ్.. ఫీచర్లు ఇదిగో..
- కొత్త చేతక్ స్కూటర్లను లాంచ్ చేసిన బజాజ్ సంస్థ..
- ధర రూ.1.20 లక్షల నుంచి ప్రారంభం..
- 2025 బజాజ్ చేతక్ 35 సిరీస్ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajaj Chetak 35 Series: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది.. 2024కి గుడ్‌బై చెప్పి.. 2025కి ఆహ్వానం పలకబోతోన్న వేళ.. ఈవీ రంగంలో కొత్త వెహికల్స్ రాబోతున్నాయి.. ఈవీ కార్లు, ఈవీ స్కూటర్లు, ఈవీ బైక్‌లు ఇలా.. మార్కెట్‌లోకి రాబోతున్నాయి.. ఇక, మరో అడుగు ముందుకు వేసిన బజాజ్ సంస్థ కొత్త చేతక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటి ధర రూ.1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2025 బజాజ్ చేతక్ 35 సిరీస్ లాంచ్ చేసింది.. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లలో అనేక పెద్ద మార్పులను తీసుకువచ్చింది. కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.. కొత్త అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది, కొత్త ఫీచర్లను కూడా జోడించారు..
బజాజ్ చేతక్ 35 సిరీస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో అనేక పెద్ద మార్పులను తీసుకువచ్చింది. 2025 బజాజ్ చేతక్ ఇప్పుడు మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది.. 3501, 3502 మరియు 3503ను విడుదల చేసింది.. కొత్త చేతక్ 3503 ధర రూ. 1.20 లక్షలు కాగా, 3502 ధర రూ. 1.27 లక్షలు. టాప్-స్పెక్ చేతక్ 3501 ధరను ప్రకటించాల్సి ఉంది.. వీటిని ఆన్‌లైన్‌లో మరియు దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లలో బుకింగ్ ప్రారంభించింది.. అంతే కాదు ఈ నెల చివరి నుండి 3501 వేరియంట్‌ల డెలివరీ కూడా ప్రారంభించబోతోంది.. జనవరి 2025 నుండి 3502 వేరియంట్లు వినియోగదారులకు అందజేసేందుకు సిద్ధమైంది..
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
బజాజ్ చేతక్ 35 సిరీస్ ఫీచర్ల విషయానికి వస్తే..
ఇది గత మోడళ్ల కంటే తేలికైన 4.2 kW (5.6 bhp) ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఇది గంటకు 73 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.. బ్యాటరీకి మరింత రక్షణ కోసం బజాజ్ మరింత షీట్ మెటల్‌ను ఉపయోగించింది. ఇది కాకుండా, మోటార్ మరియు కంట్రోలర్ కోసం కొత్త కూలింగ్ లేఅవుట్.. సర్క్యూట్ కాకుండా ఉండేందుకు కొత్త iFuse ఫీచర్ తీసుకొచ్చింది.. ఈ-స్కూటర్‌లో ఎకో మరియు స్పోర్ట్ అనే రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి.
2025 బజాజ్ చేతక్ 35 సిరీస్.. కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ అదే రెట్రో-ప్రేరేపిత డిజైన్‌ను కలిగి ఉంది. కానీ స్టైలింగ్ పరంగా కొన్ని మార్పులు చేశారు. అలాగే కొత్త కలర్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫీచర్ లిస్ట్‌లో పెద్ద అప్‌డేట్ వస్తుంది, ప్రత్యేకించి టాప్-స్పెక్ 3501 వేరియంట్‌లో, ఇది ఇప్పుడు మునుపటి నాన్-టచ్ యూనిట్ స్థానంలో టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్‌తో వస్తుంది. TFT కన్సోల్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్స్, ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్, జియో ఫెన్సింగ్ మరియు మరెన్నో ఫీచర్లతో వస్తుంది. చేతక్‌లో కొత్త ఫీచర్‌లను జత చేయడం వలన.. దాని ప్రత్యర్థులతో పోటీపడేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు..
ఇక, 2025 బజాజ్ చేతక్ 35 సిరీస్ కొత్త ఫ్రేమ్‌తో అమర్చబడింది. దీనిలో 3.5 kWh కొత్త బ్యాటరీ ప్యాక్‌ని అమర్చారు. బ్యాటరీ ఇప్పుడు ఏథర్ 450 సిరీస్ మరియు రిజ్టా ఇ-స్కూటర్‌ల మాదిరిగానే ఫ్లోర్‌బోర్డ్ ప్రాంతంలో ఉంచబడింది. ఇది ప్రస్తుత చేతక్ 29 సిరీస్ కంటే చాలా పెద్దదిగా కనిపిస్తోంది.. కొత్త చేతక్‌లో సీటు పొడవు 725 మిమీ, ఇది మునుపటి కంటే 80 మిమీ ఎక్కువ. ఫుట్‌బోర్డ్ 25 మిమీ పొడవుగా ఉంటుంది, ఇది రైడర్‌కు మెరుగైన లెగ్‌రూమ్ కలిగి ఉంది.. ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొత్త ఇంజినీరింగ్ కారణంగా, వాహనం యొక్క ఉత్పత్తి వ్యయం 45 శాతం తగ్గిందని బజాజ్ తెలిపింది. ఈ-స్కూటర్ ప్రామాణికంగా 3 సంవత్సరాలు/50,000 కిమీ వారంటీతో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!