Chaganti Koteswara Rao Meets CM Chandrababu: చంద్రబాబు కీలక సూచనలు.. శక్తి మేరకు కృషి చేస్తానన్న చాగంటి..
- సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన చాగంటి కోటేశ్వరరావు..
- ప్రభుత్వ సలహాదారు చాగంటిని శాలువాతో సన్మానించిన సీఎం..
- భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి..
- విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయాలని చాగంటికి సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaganti Koteswara Rao Meets CM Chandrababu: ఈ మధ్యే నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. నైతిక విలువల సలహాదారుగా (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్) చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ కేబినెట్ హోదా కల్పించింది సర్కార్.. అయితే, ఈ రోజు తనను మర్యాదపూర్వకంగా కలిసిన చాగంటి కోటేశ్వరరావును సన్మానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక సూచనలు చేశారు.. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును శాలువాతో సన్మానించిన సీఎం చంద్రబాబు.. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి.. విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి అంటూ చాగంటి కోటేశ్వరరావుకు సూచించారు.. ఇక, తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు చాగంటి కోటేశ్వరరావు..
Read Also: Groom Chasing: ఓ దొంగకు తిక్క కుదిర్చిన వరుడు.. సినిమాను తలపించిన ఛేజింగ్
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
మరోవైపు.. విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఈరోజు ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి లోకేష్.. ఇందుకు మీ వంటి పెద్దల అమూల్యమైన సలహాలు అవసరమని అన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించేందుకు తమ వంతు సలహాలు, సహకారం అందిస్తానని.. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందన్నారు చాగంటి కోటేశ్వరరావు..


తాజావార్తలు
-
WTC Final: భారత్ ఫైనల్ చేరడానికి ఇదొక్కటే మార్గం.. ఇలా చేయకపోతే ఇంటికే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!