Site icon NTV Telugu

Chaganti Koteswara Rao Meets CM Chandrababu: చంద్రబాబు కీలక సూచనలు.. శక్తి మేరకు కృషి చేస్తానన్న చాగంటి..

Chaganti Koteswara Rao

Chaganti Koteswara Rao

Chaganti Koteswara Rao Meets CM Chandrababu: ఈ మధ్యే నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. నైతిక విలువల సలహాదారుగా (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్) చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ కేబినెట్‌ హోదా కల్పించింది సర్కార్‌.. అయితే, ఈ రోజు తనను మర్యాదపూర్వకంగా కలిసిన చాగంటి కోటేశ్వరరావును సన్మానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక సూచనలు చేశారు.. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును శాలువాతో సన్మానించిన సీఎం చంద్రబాబు.. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి.. విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి అంటూ చాగంటి కోటేశ్వరరావుకు సూచించారు.. ఇక, తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు చాగంటి కోటేశ్వరరావు..

Read Also: Groom Chasing: ఓ దొంగకు తిక్క కుదిర్చిన వరుడు.. సినిమాను తలపించిన ఛేజింగ్

మరోవైపు.. విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఈరోజు ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి లోకేష్.. ఇందుకు మీ వంటి పెద్దల అమూల్యమైన సలహాలు అవసరమని అన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించేందుకు తమ వంతు సలహాలు, సహకారం అందిస్తానని.. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందన్నారు చాగంటి కోటేశ్వరరావు..

 

 

Exit mobile version