వెన్నెల కిషోర్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు హీరోగా ఓ సినిమాలో నటించాడు.. చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.. అక్కడ ఆశించిన రిజల్ట్ ను అందుకోలేక పోయింది..
ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్‌కు ముందే సొంతం చేసుకున్నది. మార్చి 16 నుంచి ఓటీటీలో చారి 111 మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహాలో కూడా చారి 111 మూవీ విడుదల అవుతుందని సమాచారం.. మిస్టర్ బీన్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ జానీ ఇంగ్లీష్ సినిమా ఆధారంగా రూపొందింది.. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించాడు. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటించింది. మురళీశర్మ, సత్య, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించారు..
కామెడీతో ప్రేక్షకులను నవ్వించే పని చేశారు కానీ కథను సరిగ్గా చూపించలేదనే టాక్ ను అందుకున్నాడు డైరెక్టర్..దాంతో రిజల్ట్ కాస్త నిరాశను మిగిల్చింది.. చారి 111 మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. టీజర్స్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్లలో రిలీజ్ చేశారు. చారి 111 మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. రుద్రనేత్ర ఏజెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో మరిన్ని సినిమాలు తెరకెక్కించనున్నట్లు చారి 111 ప్రమోషన్స్‌లో డైరెక్టర్ ప్రకటించారు.. ఎవరితో ఏ సినిమా చేస్తారో త్వరలోనే క్లారిటి రాబోతుంది..