Adar Poonawalla: గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉత్పత్తి భారత్‌లో అప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adar Poonawalla: గర్భాశయ క్యాన్సర్ చికిత్స కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్ సెర్వవాక్ ఉత్పత్తిని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. కొవిడ్‌పై దృష్టి సారించిన కారణంగా హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఉత్పత్తిని రెండేళ్లపాటు వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2023 ప్రారంభంలో భారత ప్రభుత్వానికి తక్కువ మోతాదులో డోస్ సరఫరా చేయడం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్‌ను కట్టడి చేయడంలో ఈ వ్యాక్సిన్ కీలకంగా పనిచేస్తుందన్నారు. ఎగుమతుల కోసం 2024 వరకు వేచి ఉండాల్సిందేనన్నారు. 2024లో యూనిసెఫ్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తామన్నారు. హెచ్‌పీవీ టీకాలు కొన్ని రకాల గర్భాశయ క్యాన్సర్‌ను నివారిస్తాయని ఆయన వెల్లడించారు. కంపెనీ 150 మిలియన్లకు పైగా డోస్‌ల తయారీ స్థాయిని నిర్మించాల్సి ఉందన్నారు.
Also Read
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
Fire Accident: ఢిల్లీలోని బాంక్వెట్ హాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
సెర్వవాక్ వ్యాక్సిన్ దేశీయ వినియోగం కోసం ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందిందనన్నారు. దేశీయంగా ప్రారంభించిన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రీక్వాలిఫికేషన్ పొందాలని భావిస్తున్నామని అదర్ పూనావాలా చెప్పారు. కంపెనీ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఇండియన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కూడా చాలా ఆర్డర్‌లను ఇస్తుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
-
CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
-
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!